బల్భీర్ సింగ్ విషయంలో అధికారుల తప్పుకూడా వుందా..? Killer jawan is `mentally ill', his family had warned CISF

Killer jawan is mentally ill his family had warned cisf

Unstable, Familiy, Depressive, CISF, Balvir Singh, manic depressive, psychiatric treatment, Aurangabad district, Bihar

Balvir Singh, the 32-year-old CISF jawan who shot dead four fellow soldiers in Bihar's Aurangabad district, was a manic depressive undergoing psychiatric treatment for some time.

బల్భీర్ సింగ్ విషయంలో అధికారుల తప్పుకూడా వుందా..?

Posted: 01/14/2017 02:03 PM IST
Killer jawan is mentally ill his family had warned cisf

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) జవాను జరిపిన కాల్పుల్లో నలుగురు సహచర కానిస్టేబుళ్లు మృతి చెందిన ఘటనలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తుంది. జవాను సహచరులపై కాల్పులు జరపడానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతున్న క్రమంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా ఓ కారణమని తెలుస్తోంది. మానసిక పరిస్థితి బాగోలేని జవానును విధ్లులో ఎలా కొనసాగనిచ్చారన్న విమర్శలను అధికారులు ఎదుర్కోంటున్నారు.

ఉద్యోగంలో చేరేప్పుడు అతను బాగానే వున్నా.. ఆ తరువాత క్రమంగా అతనిలో వస్తున్న మార్పులను అధికారులు గమనించకుండా నిర్లక్ష్యం వహించారని తెలుస్తుంది. కాల్పులు జరిపిన బల్బీర్‌ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, దీనికోసం సైకియాట్రిక్‌ ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. బల్బీర్‌ తల్లి మాట్లాడుతూ.. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అందరికీ తెలుసు అని అన్నారు. స్నేహితులు సైతం అతడు ప్రమాదకరమైన వ్యక్తి అని మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. గతంలో అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు వివరించినట్లు సమాచారం.

గతంలో బొకారోలో విధులు నిర్వర్తించే సమయంలో సైతం బల్బీర్‌.. ఓ కారు డ్రైవర్‌ను చంపడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. బల్బీర్‌ మానసిక పరిస్థితి సరిగా లేకున్నా కూడా సీఐఎస్‌ఎఫ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్లనే నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  బల్బీర్‌ జరిపిన కాల్పుల్లో హెడ్‌ కానిస్టేబుళ్లు బచ్చా శర్మ, అమర్‌నాథ్‌ మిశ్రాతో పాటు.. ఏఎస్‌ఐ జీఎస్‌ రామ్‌, హవల్దార్‌ అరవింద్‌ రామ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles